‘తోడేలు’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం

‘తోడేలు’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం

Published on Nov 17, 2022 7:02 PM IST


వరుణ్ ధావన్, కృతి సనన్ హీరో హీరోయిన్స్ గా బాలీవుడ్ లో తెరకెక్కిన థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ కామెడీ ఫిలిం భేదియా. ఎంతో భారీ స్థాయిలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ నవంబర్ 25న పలు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇక తెలుగులో తోడేలు టైటిల్ తో రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై తెలుగు ఆడియన్స్ లో సైతం మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ యొక్క తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 19న హైదరాబాద్ లోని వెస్ట్ ఇన్ హోటల్ లో ఉదయం 9 గం. ల నుండి ప్రారంభించనుంది యూనిట్. ఇక తెలుగులో ఈ మూవీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు అమర్ కౌశిక్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ మూవీ తెలుగులో సైతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు