సరిగ్గా ఐదేళ్ల క్రితం యంగ్ హీరో నిఖిల్ హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇంట్రెస్టింగ్ మలుపులతో,గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంది. స్వాతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రావు రమేష్ కీలక పాత్రలు చేయడం జరిగింది. కాగా ఈ హిట్ మూవీకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఎప్పటినుండో ఉంది. గతంలో కూడా అనేక మార్లు కార్తికేయ మూవీ సీక్వెల్ గురించి వార్తలు రావడం జరిగింది.
ఐతే కార్తికేయ 2 చిత్రానికి ముహూర్తము కుదిరిందని తాజాగా అందుతున్న సమాచారం. దర్శకుడు చందూ మొండేటి స్క్రిప్ట్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ రెడీ చేయడంతో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వనాధ్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెలలో లేదా డిసెంబర్ లో సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు. ఇక నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం మూవీ విడుదలకు నోచుకోవడం లేదు. వచ్చే నెలలో విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
