రానాపై వేసిన పంచ్ కు క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్ !


నరేష్ అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ఇన్నాళ్లు ఒకే తరహాలో సినిమాలు చేసిన ఆయన ఈసారి కొంచెం భిన్నత్వంతో చేసిన ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని చాల నమ్మకంగా ఉన్నారాయన. అంతేగాక ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు కూడా బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఈ ట్రైలర్లో నరేష్ ఓపికానొక సందర్భంలో ‘మేటర్ లేని వాడికి మేటర్ లేదని చెప్పాలి కానీ నువ్వు దగ్గుబాటి రానా అని దగ్గరుండి నెట్టకూడదు’ అంటూ ఒక పంచ్ పేల్చాడు.

దీంతో అందరికీ కాస్తంత ఆశ్చర్యం, ఆసక్తి రెండూ కలిగాయి. దీవిపై తాజా మీడియా మీట్లో స్పందించిన నరేష్ ‘రానా నాకు మంచి ఫ్రెండ్. ఆ పంచ్ ఏదో సందర్భానుసారంగా, ప్రాస కోసం వేసింది. అంతేగాని రానాను కించపరచాడనికి కాదు. ట్రైలర్లో ఆ డైలాగ్ చూసి చాల మంది ట్విట్టర్లో ట్రైలర్ ను రానాకు ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. రానా దాన్ని చూసి ఆశ్చర్యంతో నాకు ఫోన్ చేసి బాబాయ్ ఇంతకీ నాకు మ్యాటర్ ఉందంటావా లేదంటావా అంటూ స్పోర్టివ్ గా మాట్లాడాడు’ అన్నారు. ఇకపోతే ఈ చిత్రం రేపు 8న రిలీజ్ కానుంది.