ప్రారంభమైన అల్లరోడి ‘బందిపోటు’

Bandipotu
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో సినిమాకి సినిమాకి తక్కువ గ్యాప్ తీసుకునే హీరోల్లో అల్లరి నరేష్ ప్రధముడు అని చెప్పాలి. ఎందుకంటే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ‘లడ్డూబాబు’ సినిమా వచ్చి రెండు నెలలు పూర్తి కాకముందే ‘జంప్ జిలానీ’ సినిమాని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ కి ముందే అల్లరి నరేష్ తన తదుపరి సినిమా ‘బందిపోటు’ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఈ రోజు ఉదయం ఈవివి ఆఫీసులో లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రామానాయుడు, సురేష్ బాబు, జెమిని కిరణ్, అనిల్ సుంకర ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈవివి బ్యానర్ పై రాజేష్ ఈదర నిర్మించనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఈష హీరోయిన్ గా నటించనుంది. కళ్యాన్ కోడూరి మ్యూజిక్ అందించనున్నాడు.

Exit mobile version