నాగార్జున మూవీలో నటించడం పై అల్లరి నరేష్ క్లారిటీ

Published on Feb 22, 2023 11:53 pm IST

కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ది ఘోస్ట్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. ఇక అతి త్వరలో రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ తెరకెక్కించనున్న మూవీలో ఆయన హీరోగా నటించనున్నారు. యాక్షన్ మూవీ గా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ని ప్రసన్న కుమార్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ మూవీ పై నాగ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా మూవీకి ప్రసన్న కుమార్ అద్భుతమైన స్టోరీ అందించి దానితో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నాగార్జున తో తొలిసారిగా తాను మెగాఫోన్ పట్టనున్న ఈ మూవీని కూడా అన్ని విధాలా సక్సెస్ చేసేలా స్టోరీ, స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో అల్లరి నరేష్ ఒక కీలక రోల్ చేయనున్నారు అనే వార్త కొద్దిరోజులుగా టాలీవుడ్ లో బజ్ గా ప్రచారం అవుతోంది. ఇక నేడు అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియా వారు నాగార్జున సినిమా విషయమై అడగగా ఆయన దానిపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి తనని ప్రసన్న కుమార్ కలిసారని, అయితే ప్రస్తుతం తమ మధ్య కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఒకవేళ ఫైనలైజ్ అయితే తప్పకుండా న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ అవుతుందని అన్నారు అల్లరి నరేష్. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించి అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం :