మరో గెస్ట్ రోల్ లో అల్లరి నరేష్ ?

Published on Aug 2, 2021 3:00 pm IST

హీరో మంచు మనోజ్‌ ప్రస్తుతం చేస్తోన్న కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. కాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో నటిస్తాడని గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలోని ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తాడట. అల్లరి నరేష్ ది గెస్ట్ రోల్ అని, క్లైమాక్స్ లో వచ్చే ఆ రోల్ లో రెండు నిముషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమాకే ఈ పాత్ర కీలకమైనది అట. గతంలో మహర్షి సినిమాలో కూడా అల్లరి నరేష్ గెస్ట్ రోల్ లో నటించాడు.

ఇక ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.

దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :