“ఉగ్రం” లో తన పాత్ర పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 4, 2023 8:24 pm IST


టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రమ్. ఈ మూవీ లో తన క్రూరమైన పాత్ర పై అల్లరి నరేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నవరసాల్లో కామెడీ చేయడం చాలా టఫ్ జాబ్ అని నా అభిప్రాయం. అందరూ కూడా కామెడీ చేయడం చాలా ఈజీ అనే అభిప్రాయం లో ఉంటారు. ఎవరైతే కామెడీ చేయగలరో, అన్నీ చేయగలరు అని అన్నారు. బ్రహ్మానందం ను రంగమార్తాండ లో, సూరి ను విడుదల లో చూశాం అని నరేష్ అన్నారు. నటన ద్వారా ఇతరులను ఏడిపించడం చాలా సులువు అని, నవ్వించడం కష్టం అని అన్నారు.

అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉగ్రం మూవీ రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :