అల్లరి నరేష్ సినిమాకు ముహూర్తం కుదిరింది !

20th, January 2018 - 09:48:22 AM


అల్లరి నరేష్ కెరీర్ లో సంచలన విజయం అందించిన సినిమా సుడిగాడు. కొంత గ్యాప్ తరువాత అదే కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించబోతున్న సినిమా ఈ నెల 27 న ప్రారంభం కాబోతోంది. అదే రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు చిత్ర యూనిట్.

సుడిగాడు సినిమాకు సంగీతం అందించిన శ్రీ వసంత్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. సునీల్ ఈ సినిమాలో అల్లరి నరేష్ కు ఫ్రెండ్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. సక్సెస్ ఫుల్ సినిమా తీసిన యూనిట్ మళ్ళి కలిసి పని చేస్తుండడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.