అల్లరి నరేష్ సినిమాకు ముహూర్తం కుదిరింది!

1st, January 2018 - 10:05:23 AM

అల్లరి న‌రేష్‌ నటించిన సుడిగాడు సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా సుడిగాడు 2 రాబోతోంది. బిమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జనవరి 12 న ప్రారంభం కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

తెలుగులో ఉన్న ప్రముఖ కమీడియన్స్ అందరు ఈ సినిమాలో నటించబోతున్నారు. అత్యంత వినోధభరితంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హిట్ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించి చిత్ర యూనిట్ కు పేరు రావాలని కోరుకుందాం. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.