మహేష్ 25లో అల్లరి నరేష్ పేదవాడిగా నటించనున్నాడా ?

naresh mahesh babu7

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం లో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం
గురించి రోజుకో వార్త బయటికి వస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ చిత్రంలో మహేష్ ధనవంతుడిగా నటిస్తుంటే అల్లరి నరేష్ పేదవాడిగా కనిపించనున్నాడట.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్, పివిపిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Exit mobile version