సాలిడ్ గా ఊహించని లెవెల్లో అల్లరి నరేష్ “ఉగ్రం” టీజర్.!

Published on Feb 22, 2023 11:40 am IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేశ్ తన ట్రాక్ మార్చి ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ పాత్రలు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా తాను ఇదివరకు చేసిన ఇంటెన్స్ హిట్ చిత్రం నాంది దర్శకుడు విజయ్ కనకమేడల తో చేస్తున్న లేటెస్ట్ సినిమానే “ఉగ్రం”. మంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తో అయితే బజ్ నమోదు చేస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు టీజర్ ని యంగ్ హీరో అఖిల్ అక్కినేని చేతులు మీదగా రిలీజ్ చేశారు.

ఇక ఈ టీజర్ మాత్రం అసలు అల్లరి నరేష్ నుంచి నెవర్ బిఫోర్ లెవెల్లో ఉందని చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమాలో అల్లరి నరేష్ సరికొత్త అవతార్ పలు డిఫరెంట్ షేడ్స్ లో చాలా సాలిడ్ గా కనిపిస్తుంది. అలాగే తన యాక్షన్ సీక్వెన్స్ లు గాని ఇంటెన్స్ ఎమోషన్స్ ని గాని ఈ టీజర్ లో చాలా ఆసక్తిగా ఉన్నాయని చెప్పాలి. నాంది కి కంప్లీట్ డిఫరెంట్ గా దర్శకుడు అల్లరి నరేష్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసాడని చెప్పాలి.

అలాగే ఈ టీజర్ లో సాలిడ్ స్కోర్ కూడా మరింత ఆసక్తిని అయితే రేపింది. మొత్తానికి అయితే ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి మరో ప్రామిసింగ్ సినిమా వస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :