ముగింపు దశకు చేరుకున్న అల్లరి నరేష్ చిత్రం !

20th, May 2017 - 09:24:58 AM


‘సెల్ఫీ రాజా, ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో నిరుత్సాహపడ్డ హీరో అల్లరి నరేష్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన చిత్రమే ‘మేడ మీద అబ్బాయి’. జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన్నచంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్ గా రూపొందుతోంది.

మర్చి నెల మధ్యలో మొదలైన ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఇక మాత్రం మిగిలుందని, చిత్రాన్ని జూన్ చివరి వారంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంతో నిఖిల విమల హీరోయిన్ గా పరిచయమవుతోంది. డీజే. వసంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, సత్యం రాజేష్ వంటి ఇతర ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.