మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో అల్లరి నరేష్

allari-naresh
ఒకప్పుడు చిన్న సినిమాలకి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాల్లో ఉన్నారు. ఆయన తాజా చిత్రం ‘సెల్ఫీ రాజా’ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఆయనకు ఆశించిన సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం ‘ఇంట్లో ఉంది దెయ్యం’ చిత్రంలో నటిస్తున్న ఈ కామెడీ హీరో త్వరలో మలయాళంలో 2015 లో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే చిత్రం రీమేక్ లో నటించనున్నాడు.

ఈ రీమేక్ కు ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. నిర్మాత బొప్పన చంద్రశేఖర్ రీమేక్ రైట్స్ దక్కించుకున్న ఈ చిత్రానికి డి.జె. వసంత్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంలో జి. ప్రజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 4.5 కోట్ల బడ్జెట్ తో రూపొంది సుమారు రూ.32 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ రీమేక్ యొక్క షూటింగ్ అక్టోబర్ లో మొదలుకానుంది.