మారుతీ “పక్కా కమర్షియల్‌” ని మెచ్చుకున్న అల్లు అరవింద్

Published on Jun 17, 2022 9:00 pm IST

పక్కా కమర్షియల్ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ ప్రచార కంటెంట్ తో సినిమా పై హైప్ క్రియేట్ అయ్యింది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా మరియు గోపీచంద్ ప్రధాన పాత్రలు పోషించారు.

అల్లు అరవింద్ అందించిన ఈ చిత్రం ఫైనల్ కాపీని ఈరోజు వీక్షించారు. రిజల్ట్‌తో థ్రిల్‌గా ఉన్న ఆయన, సినిమాని పటిష్టంగా తెరకెక్కించినందుకు మారుతీ, బన్నీ వాస్‌లను అభినందించారు. రావు రమేష్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నాడు. యాక్షన్‌తో కూడిన కామెడీ కేపర్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :