మెగా ప్రొడ్యూస్ అల్లు అరవింద్, ఇటీవల తండేల్ చిత్ర ఈవెంట్‌లో స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజుని వేదికపైకి పిలుస్తూ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీంతో అల్లు అరవింద్‌ను సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ తెగ ట్రోలింగ్ చేశారు. అయితే, తాజాగా ‘తండేల్’ చిత్ర పైరసీపై నిర్మాతలు బన్నీ వాస్, అల్లు అరవింద్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఇష్యూపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
ఆ రోజు వేదికపైకి దిల్ రాజుని పిలిచిన అల్లు అరవింద్, ఒక వారంలో దిల్ రాజు జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు గురయ్యిందనే విషయాన్ని వ్యక్తం చేయాలని చూసినట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే తాను దిల్ రాజు సినిమాల గురించి మాట్లాడానని.. అంతేగాని, చరణ్ సినిమాను తక్కువ చేయాలని కాదని అల్లు అరవింద్ అన్నారు. చరణ్ అంటే తనకు కొడుకు లాంటోడు.. తనకు ఉన్న ఏకైక మేనల్లుడు చరణ్ అని.. చరణ్‌కి తాను ఏకైక మేనమామ అని.. తమ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని.. దయచేసి ఇలాంటి అంశాలతో తమ బాండింగ్‌పై వివాదాలు క్రియేట్ చేయవద్దని ఆయన అభిమానులను కోరారు.
దీంతో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అల్లు అరవింద్ కామెంట్స్ చేశారనే అంశానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. ఇక తండేల్ చిత్రాన్ని పైరసీ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నవారు.. డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నవారిపై కూడా త్వరలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.