శివ తత్వం పై సినిమా చూసి, విష్ణు తత్వం మీద సినిమా రావాలని కోరుకున్నాను – అల్లు అరవింద్

శివ తత్వం పై సినిమా చూసి, విష్ణు తత్వం మీద సినిమా రావాలని కోరుకున్నాను – అల్లు అరవింద్

Published on Aug 17, 2022 10:00 PM IST

నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ ల లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 విడుదలై నాలుగు రోజులు గడవగా రోజు రోజుకు మరింతగా కలెక్షన్స్ ని అందుకుంటూ ఈ మూవీ దూసుకెళుతోంది. ఇక హిందీలో అయితే ఈ మూవీ యొక్క కలెక్షన్స్ అత్యద్భుతంగా లభిస్తున్నాయి. నార్త్ ఆడియన్స్ ఈ మూవీకి మరింతగా నీరాజనాలు పడుతుండడం విశేషం. శ్రీకృష్ణుడి ద్వారా నేపథ్యంలో సాగే మూవీగా థ్రిల్లింగ్ అడ్వెంచరస్ జానర్ లో సాగిన కార్తీయేకేయని అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ కలిసి నిర్మించగా చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కాల భైరవ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీ భారీ సక్సెస్ దిశగా కొనసాగుతుండడంతో యూనిట్ సక్సెస్ మీరు ని ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ, నిజానికి ఈ మూవీ ట్రైలర్ చూసిన తరువాత మంచి విజయం అందుకుంటుందని అనుకున్నాను అన్నారు. అయితే విడుదల అనంతరం ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా బాగా పెర్ఫర్మ్ చేయడం, ఒక హిందీలో అయితే మొదటి రోజుని మించి రెండవ రోజు, రెండు నుండి మూడు, నాలుగు రోజుల్లో విపరీతంగా థియేటర్స్ పెరగడం చూస్తుంటే ప్రేక్షకులు ఈ మూవీని ఎంత గొప్పగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా కృష్ణుడికి సంబందించిన అంశం తీసుకుని నేటి కాలం వారికి విష్ణుతత్వం గురించి, అలానే భారతీయ సంస్కృతి, సనాతనధర్మం వంటి ఎంతో గొప్పగా విషయాలను దర్శకుడు చందూ మొండేటి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చూపించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.

బాలయ్య అఖండ మూవీ చూసిన తరువాత శివతత్వం గురించి తెరకెక్కిన ఆ మూవీ పెద్ద సక్సెస్ అందుకోవడంలో ఆ పరమేశ్వరుడి దీవెనలు ఎలా ఉన్నాయో అలానే కార్తికేయ 2 భారీ సక్సెస్ లో శ్రీకృష్ణుడి దీవెనలు అలానే ఉన్నాయి అన్నారు. నిజానికి అఖండ సూపర్ హిట్ తరువాత విష్ణుతత్వం పై కూడా మూవీ రావాలని ఆశించానని, అనుకుంటూ ఉండగానే కార్తికేయ వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ అందుకుందని కొనియాడారు. అలానే యూనిట్ కూడా మొదటి నుండి మాకు ఎటువండి అడ్డంకులు ఎదురైనా స్వయంగా శ్రీకృష్ణుడే దారి చూపించారని, మూవీ భారీ సక్సెస్ కి కూడా ఆయన ఆశీస్సులే కారణం అనడం విన్నానన్నారు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ మాత్రమే కాదు, వారిద్దరూ కూడా ఒక గొప్ప కాజ్ కోసం పరిగెడుతుంటే మనం అందరం కూడా వారి వెంట వెళ్లేలా థియేటర్ లో చూస్తుంటే అనిపిస్తుందని అన్నారు.

ఒక పౌరాణిక నేపథ్యం ఉన్న మెయిన్ పాయింట్ ని తీసుకుని దానిని నేటి కలియుగానికి తీసుకురావడం, ఆపై దానిని అందరికీ అర్ధం అయ్యే విధంగా గొప్పగా విశ్లేషించడం చందూ మొండేటి వండర్ఫుల్ టేకింగ్ కి తార్కాణం అన్నారు. నీలాల నింగి కింద తేలియాడు భూమిని తనలోనే చూపించడం, పడగ విప్పి మడుగున లేచి సర్ప శేషం ఎక్కి నాట్యమాడి కాలీయుణీ దర్పమణచడం వంటి శ్రీ కృష్ణ లీలలు మనకు అందరికీ తెలిసినవి. కానీ దర్శకుడు చందు మొండేటి శ్రీ కృష్ణుని లీలలను సైన్స్ కి,టెక్నలాజీ కి కలిపి అద్భుతంగా ఆకట్టుకునే రీతిలో విజువల్ గా వివరించడం ప్రేక్షకులను కదిలించింది. మనకు కనిపించడం లేదంటే మన కన్ను చూడలేకపోతుందని అని అర్ధం, మనకు కన్ను లేదని కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మం మతం కాదు మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన శ్రీ కృష్ణుడు కంటే గురువు ఎవరు వంటి గొప్ప సంభాషణలు మనలో చాలా మందిని ఆలోచింపజేస్తాయి. ఏదేమైనా ఎప్పుడు జరిగేదానిని అనుభవం అంటారు, ఎప్పుడో జరిగేదానిని అద్భుతం అంటారు. చందు మొండేటి తీసిన కార్తికేయ అటువంటి అద్భుతమే. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకెంతటి బాక్సాఫీస్ ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు