ఆసక్తిగా మారిన అల్లు అరవింద్ కామెంట్స్.!

ఆసక్తిగా మారిన అల్లు అరవింద్ కామెంట్స్.!

Published on Nov 20, 2022 9:01 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో పలు సినిమాల రిలీజ్ ల విషయంలో పరిస్థితులు కాస్త ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి సంబంధించి అయితే డైరెక్ట్ తెలుగు సినిమాలకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పిన నిర్మాత దిల్ రాజు మాట తోనే తెలుగు సినిమా ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఓ అధికారిక ప్రెస్ నోట్ రావడం సెన్సేషన్ గా మారింది.

ఇక ఇదిలా ఉండగా ఈ అంశంతో లేటెస్ట్ గా మరో ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దగ్గరకి ఈ ప్రశ్న వెళ్లగా తాను చెప్పిన వన్ లైన్ సమాధానం ఆసక్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఒక్కటి అయిన నేపథ్యంలో కేవలం స్ట్రైట్ సినిమాలకే తెలుగులో థియేటర్స్ ఇవ్వాలి అని చెప్పడం ‘జరిగే పని కాదు’ అని సమాధానం ఇచ్చేసారు. దీనితో ఇప్పుడు ఈ మాటలు టాలీవుడ్ లో కొత్త చర్చలకు దారి తీసి సంక్రాంతి రిలీజ్ హీట్ ని మరింత పెంచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు