రాజు తలుచుకుంటే వరాలకు కొదవా.. ఏపీ సీఎం జగన్‌కి అల్లు అరవింద్ విజ్ఞప్తి..!

Published on Oct 1, 2021 12:18 am IST

ఏపీ సీఎం జగన్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కీలక విజ్ఞప్తి చేశారు. అక్కినేని అఖిల్ , పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటికి సీఎం జగన్ పరిష్కారం చూపాలని కోరారు.

అంతేకాదు నేను చేసే విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా తీసుకోండని, రాజు తలుచుకుంటే వరాలకు కొదవా అని అన్నారు. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌కు ఇది మొదటి ఫంక్షన్‌ అని, త్వరలోనే ప్రీరిలీజ్‌ వేడుక, సినిమా విడుదలైన తర్వాత సక్సెస్‌మీట్‌ తప్పకుండా ఉంటాయని అన్నారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :