బొమ్మ సూపర్ హిట్టు.. ‘తండేల్’ మూవీ పై అల్లు అరవింద్ రివ్యూ

బొమ్మ సూపర్ హిట్టు.. ‘తండేల్’ మూవీ పై అల్లు అరవింద్ రివ్యూ

Published on Feb 6, 2025 9:00 PM IST

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి లవ్ స్టోరీ చిత్రంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ తాజాగా ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్‌లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్ ఫ్యాక్టర్‌గా నాగచైతన్య పర్ఫార్మెన్స్ ఉండబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన ఆయన ఈ బొమ్మ సూపర్ హిట్టు అని.. ఈ చిత్రానికి తాను 4.5/5 రేటింగ్ ఇస్తానని అల్లు అరవింద్ తెలిపారు.

దీంతో తండేల్ మూవీపై అల్లు అరవింద్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతుంది. ఈ కారణంతోనే ఆయన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు