సాయి ధరమ్ తేజ్ క్షేమంగానే ఉన్నాడు – అల్లు అరవింద్

Published on Sep 11, 2021 1:13 am IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో సాయి తేజ్‌కి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. తాజాగా సాయి తేజ్ హెల్త్ కండీషన్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అపోలో ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ సాయి తేజ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని తెలిపాడు.

నేను స్వయంగా వైద్యుల దగ్గర మాట్లాడి చెబుతున్నానని సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన పనిలేదని, డాక్టర్ల నుంచి కూడా హెల్త్ బులిటెన్ కొద్దిసేపటిలో వస్తుందని అన్నారు. తలకు గానీ, శరీరంలో ఎక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది లేవని వైద్యులు చెప్పారని అన్నారు. రేపు ఉదయం జనరల్ వార్డుకు తీసుకొస్తారని.. సాధారణంగా మాట్లాడతాడని వైద్యులు చెప్పారని, మీడియాలో ఏవేవో వార్తలు రాకుండా మా ఫ్యామిలీ నుంచి నేను తేజ్ కండీషన్ గురుంచి చెప్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :