ప్రపంచం లో ఎత్తైన స్థాయి లో అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలు!

Published on Nov 21, 2021 7:02 pm IST

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అయిన అల్లు అర్హ పుట్టిన రోజు నేడు. అయితే కుమార్తె కోసం అల్లు అర్జున్ చేసిన ప్లాన్ ఇప్పుడు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా యజమానులు ఎమ్మార్ ప్రాపర్టీస్ ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు అతని కుటుంబ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలు ప్రపంచంలోనే ఎత్తైన స్థాయిలో జరిగాయి. అలా జరిగిన మొదటి పుట్టినరోజు వేడుక ఇదే. ప్రైవేట్ అంతస్తులో పబ్లిక్ యాక్సెస్ లేదు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో పుట్టినరోజు పార్టీ ఏదీ నిర్వహించలేదు. అలా జరిగిన మొదటి పుట్టిన రోజు అర్హది మాత్రమే. అల్లు అర్జున్ చేసిన పనికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :