అఖిల్ హిట్ సాధించడం ఎంతో సంతోషం గా ఉంది – అల్లు అర్జున్

Published on Oct 20, 2021 11:30 am IST

హైదరాబాద్ లో జరిగిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో అల్లు అర్జున్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం తో హిట్ సాధించడం పట్ల అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.

అఖిల్ ను చూసినప్పుడల్లా బ్రదర్ లా భావిస్తా అని, అఖిల్ ప్రారంభానికి ముందు, మరియు అఖిల్ ఎంట్రీ గురించి నాగార్జున సర్ తో తన అభిప్రాయాలను పంచు కొనేవాడ్ని అని అన్నారు. అదే విధంగా పూజా హెగ్డే పై సైతం బన్నీ ప్రశంసల వర్షం కురిపించారు. Dj మరియు అల వైకుంఠ పురంలో తనతో నటించింది అని, తను నటిగా మెరుగు పడటం మాత్రమే కాకుండా, ప్రతి సినిమాతో మరింత అందంగా కనిపిస్తుంది అని అన్నారు.

అల్లు అర్జున్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి, నిర్మాతలు అయిన బన్నీ వాసు, వాసు వర్మ లకి, అల్లు అరవింద్ లను అభినందించారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం సక్సెస్ సాధించిన విధంగా రాబోయే సినిమాలని ప్రోత్సహించాలి అని ప్రేక్షకులను బన్నీ కోరారు.

సంబంధిత సమాచారం :

More