మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్…ఆర్ ఆర్ ఆర్ గ్లింప్స్ పై అల్లు అర్జున్ కామెంట్స్

Published on Nov 1, 2021 1:40 pm IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం నుండి తాజాగా గ్లింప్స్ విడుదల అయింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన గ్లింప్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు మునుపెన్నడూ లేని విధంగా ఉన్నారు. ఇంటెన్స్ లుక్ తో, ఓ లెవెల్ లో ఎలివేషన్ తో గ్లింప్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ కు ధీటుగా ఉంది. ఈ చిత్రం భారీ రికార్డులను కొల్ల గొడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఈ చిత్రం గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం గ్లింప్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇండియా సినిమా కి రాజమౌళి గర్వకారణం అని అన్నారు. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ పవర్ ప్యాక్ షో అని అన్నారు.అంతేకాక అజయ్ దేవగణ్ కి మరియు అలియా భట్ తో పాటుగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :