థాంక్యూ త్రివిక్రమ్ గారు – అల్లు అర్జున్

Published on Jan 12, 2022 5:30 pm IST


అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠ పురంలో చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకోవడం తో సోషల్ మీడియా వేదిక గా అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

స్వీటెస్ట్ రీకాల్ అని, రెండేళ్ల అల వైకుంఠ పురంలో అని అన్నారు. ఇంకా ఆ స్వీట్ నెస్ ను ఫీల్ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. చాలా స్పెషల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థాంక్స్ తెలిపారు. ఆల్బమ్ ఆఫ్ డికేడ్ అందించిన సోదరుడు థమన్ కి కూడా థాంక్స్ తెలిపారు.చిత్రం లో నటించిన నటీనటులకు, నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ కూడా థాంక్స్ తెలిపారు. అల్లు అర్జున్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :