పుష్ప 2 కోసం సరికొత్తగా మార్చబోతున్నాడు!

పుష్ప 2 కోసం సరికొత్తగా మార్చబోతున్నాడు!

Published on Apr 18, 2022 8:12 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. బన్నీ నటన చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ తన రఫ్ లుక్ ను సరికొత్తగా మార్చబోతున్నాడు.

రఫ్ లుక్ తో పాటు స్టైలిష్ లుక్ లో కూడా ఈ బన్నీ ఈ సినిమాలో కనిపిస్తాడట. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. ఇక ఈ సినిమాలో సమంత తన డాన్స్‌తో, అలాగే రష్మిక తన నటనతో కేక పెట్టించారు. దేవిశ్రీప్రసాద్ కూడా తన మ్యూజిక్‌ తో మైండ్ బ్లాంక్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు