బోయపాటి డైరెక్షన్ లో మరొకసారి అల్లు అర్జున్!

Published on Sep 10, 2021 11:32 pm IST

అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పుష్ప చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదల కావాల్సి ఉండగా పలు కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరియు తదితర కారణాల వలన వాయిదా పడింది. ఈ చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడటంతో సినిమాలు ఇంకాస్త లేట్ అవుతున్నాయి. ఈ మేరకు అల్లు అర్జున్ వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయాల్సి ఉండగా, ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నారు. పుష్ప పార్ట్ 1 పూర్తి అనంతరం సినిమా బోయపాటి సినిమా మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాక అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ విజయం సాధించారు.

సంబంధిత సమాచారం :