‘డీజే’కి రెడీ అయిపోయిన అల్లు అర్జున్..!

18th, October 2016 - 08:38:42 PM

dj-allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో ‘డీజే- దువ్వాడ జగన్నాథం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమైపోయింది. అక్టోబర్ 20నుంచి డీజే ఫస్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. ఇక అప్పట్నుంచి మొదలుకొని ఫిబ్రవరి వరకూ నిరంతరాయంగా షూటింగ్ జరపాలని టీమ్ ప్లాన్ చేసింది.

హరీష్ శంకర్ గత చిత్రాల స్టైల్లోనే యాక్షన్ కామెడీగా తెరకెక్కనున్న ‘డీజే’కు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దిల్‌రాజు టీమ్ ప్లాన్ చేసింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు.