అక్కడ ప్రత్యక్షమైన అల్లు అర్జున్…ఎందుకంటే!?

Published on Oct 8, 2021 4:41 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ శంకర్ పల్లి తహశీల్దార్ కార్యాలయం లో ఉదయం 10 గంటలకు ప్రత్యక్షం అయ్యారు. జనవాడ గ్రామం లో రెండు ఎకరాల భూమి ను రిజిష్టర్ చేయించేందుకు కార్యాలయం కి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి అధికారుల తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో పుష్పరాజ్ పాత్ర లో నటిస్తున్నారు. మళయాళ నటుడు ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. రష్మిక మండన్న ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :