ఆలస్యమైనా మంచి సినిమా చేస్తా – అల్లు అర్జున్ !‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత బన్నీ 3నెలలు కావస్తున్నా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే ఇటీవల ‘మనం’ఫెమ్ విక్రమ్ కుమార్ చెప్పిన కథ బన్నీ కి నచ్చిందని భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు బన్నీ ఈ సినిమాను కూడా ఇంకా ఫైనల్ చేయలేదట.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నామీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు దయచేసి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ సారి మీకు మంచి సినిమా ఇస్తాను దానికి కొంచం సమయం పడుతుంది. నన్ను అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు విక్రమ్ కుమార్ తో సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని. అభిమానులకోసం ఎంత లేటైనా పర్వాలేదు ఒక మంచి సినిమాను వారికి అందివ్వాలని ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

My Dearest Fans … Thank you soo much for all the Love . I wanted to tell you all pls be a lil patient about the next movie announcement … bcoz it will take a while more . I want to genuinely deliver a good film . Takes time. Thank you for understanding

— Allu Arjun (@alluarjun) July 26, 2018

Advertising
Advertising