లేటెస్ట్ : తన అభిమానులకి అల్లు అర్జున్ చిన్న విన్నపం

Published on Jun 5, 2023 5:30 pm IST

టాలీవుడ్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ ఆడియన్స్ తో పలు విషయాలు షేర్ చేసుకునే అల్లు అర్జున్, ఈ రోజు తన అభిమానులను ఒక పని చేయమని విన్నవించాడు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అల్లు అర్జున్ ఒక మొక్కను నాటారు మరియు ప్రకృతిని మరియు భూమిని రక్షించడానికి తన అభిమానులను అదే విధంగా చేయాలని కోరారు.

ఒక మొక్కకు నీరు పోస్తున్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అది కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పుష్ప 2 లో అల్లు అర్జున్ తో స్టార్ నటి రష్మిక మందన్నతో రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్‌ నెగటివ్ రోల్ చేస్తుండగా అనసూయ భరద్వాజ్, అజయ్, సునీల్, జగదీష్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :