బన్నీ, అట్లీ కూడా ఏదొకటి వదలాల్సిందే..

Allu Arjun Atlee

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ స్పాన్ తో మంచి బజ్ లో ఉన్న అతి కొద్ది సినిమాల్లో దర్శకుడు అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన భారీ సినిమా కూడా ఒకటి. అయితే ఈ స్పెషల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తెరకెక్కుతోంది అని అర్ధం అయ్యింది. అయితే దీనితో పాటుగా ఉన్న పలు భారీ సినిమాలు వారణాసి, స్పిరిట్ వంటివి రిలీజ్ కి ఎంతో సమయం ఉన్నప్పటికీ వదిలిన కంటెంట్ తో భారీ హైప్ ని సెట్ చేసుకున్నాయి.

సో అల్లు అర్జున్ అభిమానులు కూడా కొంచెం తొందర పడుతున్నారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో మరింత బజ్ క్రియేట్ చెయ్యాలి అంటే ఏదొక సాలిడ్ కంటెంట్ రావాల్సిందే అని ఎదురు చూస్తున్నారు. మరి అట్లీ, ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కంటెంట్ ఏదన్నా వదిలి ఈ సినిమాని కూడా ఆడియెన్స్ లో ట్రెండింగ్ గా నిలుపుతాడో లేదో చూడాలి మరి. ఇక ఈ భారీ సినిమాకి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version