స్వీట్ మెమోరీస్…సుకుమార్ కు బన్నీ స్పెషల్ బర్త్ డే విషెస్!

Published on Jan 11, 2022 10:51 am IST


తెలుగు సినీ పరిశ్రమలో తన సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. నేడు సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు సుకుమార్ గారు అంటూ పుష్ప ది రైజ్ సెట్స్ కి సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేశారు అల్లు అర్జున్. అదే విధంగా మరొక ఫోటో ను షేర్ చేస్తూ స్వీట్ మెమోరీస్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. భారీ వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా రేంజ్ ను మరింత పెంచింది అని చెప్పాలి. వీరిద్దరి కాంబో లో పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :