బాలయ్య “అఖండ” ప్రీ రిలీజ్ వేడుక కి చీఫ్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్!

Published on Nov 25, 2021 8:00 pm IST


నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా ను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలకి, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే నవంబర్ 27 వ తేదీన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. సాయంత్రం 6 గంటలకు శిల్ప కళా వేదిక లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుక కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ సరైనొడు చిత్రం ను చేసిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాక అల్లు అర్జున్ కి మాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :