ఫ్యాన్స్ కి జరిగిన ప్రమాదంపై అల్లు అర్జున్ ఎమోషనల్.!

Published on Dec 14, 2021 7:07 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప” సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి మొన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక మరిన్ని ప్రమోషన్స్ ని ఐకాన్ స్టార్ ప్లాన్ చేసుకున్నాడు. అలా తన ఫ్యాన్స్ తో ఒక ఫోటో షూట్ ని ప్లాన్ చెయ్యగా అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీనితో పరిస్థితి అదుపు దాటి కొంతమంది అభిమానులకి తీవ్ర గాయాలు అయ్యాయి.

మరి దీనితో ఈ విషయం అల్లు అర్జున్ దృష్టిలోకి వెళ్లగా తాను తన ఎమోషనల్ స్పందనను తెలియజేశాడు. అభిమానులు కి ఇలా ప్రమాదం జరిగిందని తెలిసి చాలా బాధ పడ్డానని మీరే నాకు అన్నిటికన్నా పెద్ద ఎసెట్. ప్రస్తుతం నా టీం దీనిపై ప్రత్యేక కేర్ తీసుకొని పరిస్థితి ని మానిటర్ చేస్తున్నారని. మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు ఐకాన్ స్టార్. మరి దర్శకుడు సుకుమార్ తో చేసిన పుష్ప ఈ డిసెంబర్ 17న విడుదల అవుతున్న సందర్భంలో తన అభిమానులకు ఇలా జరగడం బాధాకరం.

సంబంధిత సమాచారం :