సుకుమార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన బన్నీ!

Published on Dec 28, 2021 7:34 pm IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అన్ని భాషల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ఈ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పలు అంశాల గురించి ప్రస్తావించిన అల్లు అర్జున్, పుష్ప చిత్రం డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మనం జీవితం లో కొంతమందికి రుణపడి ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు. తమ కుటుంబం చిత్ర పరిశ్రమకి రావడం కి కారణం తాతగారు, తర్వాత తల్లిదండ్రులు, తనను మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న చిరంజీవి గారు అని, తర్వాత అంతలా రుణపడి ఉంది సుకుమార్ కి అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల పట్ల టీమ్ సైతం ఎమోషనల్ అయ్యారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మీక మందన్న నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :