“కేజీయఫ్ 2” చూసాక అలు అర్జున్ ఎగ్జైటింగ్ రెస్పాన్స్.!

Published on Apr 22, 2022 2:59 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” విడుదల అయ్యి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుందో చూస్తున్నాము. రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే ఓ రేంజ్ లో రెస్పాన్స్ అన్ని వర్గాల నుంచి అందుకుంది. అంతేకాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ క్రేజీ సీక్వెల్ చూసాక తమ స్పందనను వ్యక్తం చెయ్యకుండా ఉండలేకపోయారు. మరి లేటెస్ట్ గా ఇప్పుడు ఈ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు.

ఈ సినిమా చూసాక ఎగ్జైటింగ్ గా తన రెస్పాన్స్ ని తెలియజేస్తూ హీరో యష్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే హీరోయిన్ శ్రీనిధి ఇంకా నటులు రవీనా సంజయ్ దత్ లు తమ మాగ్నాటిక్ ప్రెజెన్స్ తో ఆదరగొట్టారని అలాగే సినిమాటోగ్రఫీ అందించిన భువన్ గౌడ అలాగే సంగీతం ఇచ్చిన రవి బసృర్ ల వర్క్ లు ఎక్స్ లెంట్ గా ఉన్నాయని బన్నీ తెలిపాడు. ఇక అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తన విజన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడని ఇంతమంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించిన మొత్తం టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఐకాన్ స్టార్ తెలిపాడు. దీనితో కేజీయఫ్ యూనిట్ సభ్యులు రిటర్న్ థాంక్స్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :