వైరల్ : హాలిడే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ క్యూట్ పిక్

Published on Jul 5, 2022 12:45 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో నటించనున్న పుష్ప ది రూల్ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న పుష్ప ది రూల్ మూవీకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ తన టీమ్ తో కలిసి స్టోరీ, స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నారట. ఆగష్టు చివర్లో ఈ మూవీ పట్టాలెక్కించేందుకు సిద్ధం చేస్తోంది యూనిట్.

మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలితో కలిసి సరదాగా హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆఫ్రికా టూర్ వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యామిలీ అక్కడ సరదాగా గడుపుతున్నారు. ఇక అక్కడి అందాలను, ట్రిప్ విశేషాలను మధ్యలో తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, కొద్దిసేపటి క్రితం భర్త అల్లు అర్జున్, కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో టాంజానియాలోని నేషనల్ పార్క్ లో దిగిన ఒక క్యూట్ పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెలాఖరులో వారు హాలిడే నుండి ఇండియాకి తిరిగిరానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :