“పుష్ప” చూసాక బన్నీ ఫ్యాన్ బాయ్ బాలీవుడ్ స్టార్ హీరో అనూహ్య స్పందన.!

Published on Jan 9, 2022 4:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బాక్సాఫీస్ బ్లాస్ట్ “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలతో తన దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వారి కెరీర్ లోనే బెస్ట్ వర్క్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాతోనే బన్నీ అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఎంట్రీ కూడా జరిగింది.

మరి ఈ ఎంట్రీ మాత్రం ఏ హీరోకి జరగని విధంగా సాలిడ్ స్పందనతో వచ్చిందని చెప్పాలి. ఆల్రెడీ బన్నీ కి హిందీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉందని అందరికీ తెలుసు కానీ బాలీవుడ్ స్టార్స్ లో ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. లేటెస్ట్ గా బాలీవుడ్ లో స్టార్ హీరో అయినటువంటి యంగ్ హీరో అర్జున్ కపూర్ పుష్ప సినిమా చూసాక తన స్పందనను తెలియజేసాడు.

పుష్ప సినిమా ఒక నార్మల్ సినిమా కాదు, ఒక పోయెటిక్ సినిమాలా స్మూత్ గా ఇంటెన్స్ గా అనిపించిందని తెలిపాడు. అంతే కాకుండా తాను ఆర్య నుంచే బన్నీ కి అభిమానిని అని అప్పుడు నుంచి ఇప్పుడు పుష్ప వరకు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ గానే ఈ సినిమా చూశానని పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని అది తన కళ్ళతోనే కనిపిస్తుంది అని బన్నీ పోస్టర్ పెట్టి తన రెస్పాన్స్ ని తెలియపరిచాడు. దీని బట్టి పుష్ప సక్సెస్ కోసం ఇక అందరికీ చెప్పక్కర్లేదు

సంబంధిత సమాచారం :