ఫ్యాన్స్ మీట్ రద్దు.. రచ్చ చేసిన బన్నీ అభిమానులు..!

Published on Dec 13, 2021 10:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “పుష్ప”. డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న ప్రీరిలీజ్‌ వేడుక కూడా ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఇదిలా ఉంటే నేడు అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్‌ కోసం ఫ్యాన్ మీట్‌ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ మేరకు పాసులను కూడా జారీ చేశారు.

దీంతో అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. ఏమయ్యిందో తెలీదు కానీ ఫ్యాన్‌ మీట్‌ ప్రోగ్రాం రద్దు అయ్యిందని నిర్వాహకులు ప్రకటించడంతో బన్నీ అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్‌ కన్వెన్షన్‌ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. తొక్కిసలాట జరగడంతో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి.

సంబంధిత సమాచారం :