‘తండేల్’ సినిమాకు కారణం అల్లు అర్జున్ ఫ్యాన్

‘తండేల్’ సినిమాకు కారణం అల్లు అర్జున్ ఫ్యాన్

Published on Feb 9, 2025 3:00 AM IST

అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా రావడానికి కారణం ఓ అల్లు అర్జున్ ఫ్యాన్ అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఏపీకి చెందిన జాలర్లు పాకిస్థాన్ జైలులో బందీలుగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసే ఓ కానిస్టేబుల్ చేసిన పని వల్లే ఈ సినిమాకు బీజం పడినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లోని కరాచీ జైలులో ఏపీ జాలర్లు బందీలుగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసిన ఓ కానిస్టేబుల్ వారికి సహాయం చేశాడు. అతడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని.. జాలర్లు విడుదల అవుతున్న సమయంలో తనకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ పంపాల్సిందిగా వారితో కానిస్టేబుల్ చెప్పాడట. దీంతో కార్తీక్ అనే రైటర్‌కు తమ కథను చెబుతున్న సందర్భంలో జాలర్లు ఈ విషయాన్ని తెలుపగా అది కాస్త నిర్మాత బన్నీ వాసు చెవిలో పడింది. దీంతో ఆయనకు వారి కథపై ఆసక్తి కలగడంతో ఈ సినిమాకు పునాది పడింది.

ఇలా కరాచీ జైలులోని అల్లు అర్జున్ ఫ్యాన్ కానిస్టేబుల్ ఆటోగ్రాఫ్ కోరికతో ‘తండేల్’ సినిమా కథ ప్రారంభం అయ్యిందని తండేల్ చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అసెట్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు