సత్యమూర్తికి డబ్బింగ్ ఫినిష్ చేసిన అల్లు అర్జున్

Son-Of-SatyaMurty
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న సినిమా ‘S/O సత్యమూర్తి’. ‘విలువలే ఆస్తి’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ తో పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. షూటింగ్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. గత కొద్ది రోజులుగా కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు. మిగతా నటీనటుల డబ్బింగ్ పనులు కూడా దాదాపు పూర్తవుతాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మార్చి చివరి వారంలో సెన్సార్ ని పూర్తి చేసి ఏప్రిల్ మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version