హైదరాబాద్ లో కొత్త బిజినెస్ మొదలుపెట్టనున్న ‘అల్లు అర్జున్’

allu-arjun1
ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో సూపర్ ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే అది అనుమానాం లేకుండా ‘అల్లు అర్జున్’ అని చెప్పొచ్చు. రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి తరువాత ‘సరైనోడు’ తో ఏకంగా 2016వ సంవత్సరానికి అతిపెద్ద హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ఇంతమంచి సక్సెస్ రేట్ ఉన్న బన్నీ సినిమాలేగాక మరో బిజినెస్ లో సైతం అడుగుపెడుతున్నాడు.

తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యాన్ని రుచి చూపేందుకు ‘ఎమ్ కిచెన్, కేదార్ శెలగం శెట్టి’ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో కలిసి నైట్ క్లబ్ లను ప్రారాంబించనున్నట్టు తెలిపాడు. ఈ సందర్బంగా బన్నీ జూలై 29న తన సన్నిహితుల కోసం భారీ ఎత్తున పార్టీ కూడా ఆరెంజ్ చేసినట్టు తెలుస్తోంది.