కన్నతల్లిపై ప్రేమ చాటుకున్న పుష్ప రాజ్.. మహిళా దినోత్సవం నాడు ఖరీదైన బహుమతి

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి స్టార్ అనేది అందరికీ తెలిసిందే. పుష్ప రాజ్ గా పాన్ ఇండియా మార్కెట్ లో భారీ స్టార్డం సొంతం చేసుకున్నప్పటికీ తను కూడా ఒకతల్లి కొడుకే.. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన తల్లిపై మాతృప్రేమను చాటుకున్నాడు. నిన్న ప్రపంచ మహిళా దినోత్సవం అని తెలిసిందే.

ఈ నేపథ్యంలో అనేకమంది సినీ తారలు తమ మాతృమూర్తుల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు. కానీ అల్లు అర్జున్ ఒక ఖరీదైన బహుమతి అందించి తన ప్రేమను చాటుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత కార్ బ్రాండ్స్ లో ఒకటైన లెక్సస్ నుంచి సరికొత్త మోడల్ కార్ ని బన్నీ తన తల్లి అల్లు నిర్మల గారికి బహుకరించి ఈ మహిళా దినోత్సవంని మరింత బ్యూటిఫుల్ మూమెంట్ గా నిలిపాడు. దీనితో ఈ పిక్ సోష మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version