100 కోట్లతో సమాధానం ఇవ్వబోతున్న “పుష్ప ది రైజ్”.!

Published on Jan 25, 2022 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి అలానే ఈ సినిమా యూనిట్ కెరీర్ లోనే మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది కావడంతో మొదటి నుంచి అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో సినిమాకి కొన్ని అడ్డంకులు వచ్చినా పాన్ ఇండియన్ సినిమా దగ్గర పర్ఫెక్ట్ హిట్ సినిమాగానే ఈ చిత్రం నిలిచింది.

అయితే ఈ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అయ్యినా ఈ చిత్రానికి బాలీవుడ్ ఆడియెన్స్ నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అనే ప్రశ్నే చాలా ఆసక్తిగా నిలిచింది. మరి దీనికి బన్నీ ఇప్పుడు ఏకంగా 100 కోట్లతో సమాధానం ఇవ్వబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

పుష్ప చిత్రం అక్కడ రిలీజ్ అయ్యి ఊహించని నిలకడ కనబరిచి దుమ్ము లేపింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ చిత్రం 95 కోట్ల మేర వసూళ్లను అందుకోగా ఖచ్చితంగా లాంగ్ రన్ లో 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కానీ జరిగితే బన్నీ కి నెవర్ బిఫోర్ సాలిడ్ వెల్కమ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :