సుకుమార్ ను ఇమిటేట్ చేసున్న బన్నీ… పుష్ప షూటింగ్ టైమ్ లో ఏం జరిగిందంటే?

Published on Dec 19, 2021 10:17 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప. మొదటి భాగం పుష్ప ది రైజ్ విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం కి సంబంధించిన పలు విషయాలను తాజాగా అల్లు అర్జున్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ఒక ప్రోమో ను పుష్ప టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

ప్రపంచం లో ఏ డైరక్టర్ అయిన షాట్ ఓకే అయిన తరువాత యాక్టర్ కి చెప్పే ఫస్ట్ మాట టేక్ ఓకే సార్. కానీ సుకుమార్ అలా కాదు అంటూ చెప్పుకొచ్చారు. సుకుమార్ ను ఇమిటేట్ చేస్తూ అల్లు అర్జున్ ఫన్ జెనరేట్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం :