తన మూవీ థియేటర్స్ పూజా కార్యక్రమంలో ఐకాన్ స్టార్.!

Published on Nov 6, 2021 5:05 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పక్క హీరోగానే కాకుండా గత కొన్నాళ్ల కితమే మూవీ థియేటర్ బిజినెస్ లోకి కూడా దిగిన సంగతి తెలిసిందే. ఆసియన్ సినిమాస్ వారితో కలిసి ఆల్రెడీ రౌడీ హీరో విజయ్ దేవర కొండ ఎలా అయితే తన థియేటర్స్ ని నెలకొల్పినట్టుగా బన్నీ కూడా మంచి ప్లాన్ ను వేసుకున్నాడు. హై లెవెల్ మల్టీ ప్లెక్స్ లను వరల్డ్ క్లాస్ టెక్నాలిజీతో నిర్మాణం వహిస్తున్నారు.

‘ఆసియన్ అల్లు అర్జున్’ సినిమాస్ గా నిర్మించబడుతున్న ఈ థియేటర్స్ పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నరాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారితో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రస్తుతం అల్లు అర్జున్ తన భారీ సినిమా పుష్ప తో మరో పక్క బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :