“పుష్ప 3” పై ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

“పుష్ప 3” పై ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

Published on Feb 9, 2025 9:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. మరి మేకర్స్ ఈ ఫ్రాంచైజ్ ని మూడు భాగాలతో ఎండ్ చేస్తామని ఇది వరకే చెప్పారు.

ఇలా వచ్చిన పార్ట్ 2 ఎండింగ్ లో పార్ట్ 3 పుష్ప ది ర్యాంపేజ్ గా ఉంటుంది అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఈ పార్ట్ 3 పై ఐకాన్ స్టార్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. పుష్ప పార్ట్ 3 కోసం నాకేం తెలీదు అంటూ వ్యాఖ్యానించాడు అలాగే తనకి మాత్రమే కాదు తన దర్శకుడు సుకుమార్ కి కూడా ఇంకా ఏం తెలీదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

అంటే పార్ట్ 3 అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా దాని స్క్రిప్ట్ లాంటివి ఏమీ అనుకోలేదా అనే అనుమానాలు ఇపుడు వస్తున్నాయి. అయితే మేకర్స్ ఈ సినిమా రావడానికి ఇంకా రెండు మూడేళ్లు పడుతుంది అని కొన్నాళ్ల కితం కన్ఫర్మ్ చేశారు. మరి ఈ క్రమంలో ఐకాన్ స్టార్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు