తమ సెన్సేషనల్ కాంబోపై బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Mar 5, 2023 9:01 am IST

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర లాక్ అయ్యిన మరో సెన్సేషనల్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అని చెప్పాలి. మరి అనౌన్స్మెంట్ తోనే అదరగొట్టిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రెస్పాన్స్ ని షేర్ చేసుకోవడం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతానికి నిశ్శబ్దంగానే ఉన్నా ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నానని సందీప్ వంగ గారిలో ఉన్న మ్యాజిక్ ఏదో నన్ను టచ్ చేసింది. ఖచ్చితంగా చాలా కాలం పాటుగా గుర్తుండిపోయే ఓ సినిమా మేము అందిస్తామని అనుకుంటున్నట్టుగా బన్నీ అయితే తన సాలిడ్ కాంబో కోసం తన మాటల్లో చెప్పడం మారింది. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే మొదలు కావడానికి ఇంకా సమయం ఉండగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ భారీ ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :