వైరల్ వీడియో : అభిమాని కోసం తగ్గేదెలే అంటున్న అల్లు అర్జున్

వైరల్ వీడియో : అభిమాని కోసం తగ్గేదెలే అంటున్న అల్లు అర్జున్

Published on Dec 3, 2022 2:18 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని నిర్మించారు.

అయితే పుష్ప మూవీని డిసెంబర్ 8 న గ్రాండ్ గా రష్యా లో రష్యన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేందుకు సిద్దమయింది యూనిట్. అందుకోసం మొన్న రష్యా వెళ్లిన యూనిట్, ప్రస్తుతం అక్కడ పలు ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా ఒకానొక దివ్యానంగుడైన అభిమానిని చూసి చలించిపోయిన అల్లు అర్జున్, అతడి కోసం తగ్గితే తప్పేమి లేదంటూ, చక్కగా అతడిని అక్కున చేర్చుకుని సరదాగా ముచ్చటించారు. అనంతరం అతడితో ఫోటోలు, వీడియో కూడా దిగారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు