చెన్నై లో ల్యాండ్ అయిన “పుష్పరాజ్”

Published on Dec 14, 2021 12:34 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా విడుదల కి సిద్ధమైన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు అల్లు అర్జున్ చెన్నై చేరుకున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు అని తెలిపారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :